నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన మహా నాయకుడు కేసీఆర్‌పై సినిమా తీస్తున్నారన్న వార్తలు ఆ మధ్య హల్ చల్ చేశాయి. గతేడాది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కేసీఆర్‌కు తాను పెద్ద అభిమానినని.. ఆయన జీవితంపై సినిమా తీయబోతున్నట్టు ప్రకటించేశారు. అయితే ఇదే సమయంలో మరో దర్శకుడు మధుర శ్రీధర్ కూడా తాను కేసీఆర్ బయోపిక్ తీయబోతున్నట్టు ప్రకటించేశాడు.
మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు ఏమాత్రం తీసిపోని అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లు కేసీయార్ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని తెరపైకి ఎక్కించాల్సిందేనని ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. 2017 జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షూటింగ్ మొదలుపెట్టి… 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని గతంలోనే వెల్లడించారు మధుర శ్రీధర్. తాజాగా కేసీఆర్ బయోపిక్ ను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు మధుర శ్రీధర్ చేయడం ప్రకటించాడు.
మరీ కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారన్న ప్రశ్నకు శ్రీధర్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. రాజ్ కుమార్ రావు కేసీఆర్‌గా కనిపించనున్నట్లు తెలిపాడు. జాతీయ ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావు ఇప్పటికే అనేక పాత్రలకు జీవం పోయగా, కేసీఆర్ పాత్రకి ఈ నటుడు అయితేనే సరిగ్గా సరిపోతాడని మేకర్స్ భావించినట్టు తెలుస్తుంది. ఇంతకీ రాజ్‌కుమార్ రావు ఎవరంటే.. సుషాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ జంటగా తెరకెక్కుతున్న హిందీ ఫిల్మ్”రాబ్తా” లో నేషనల్ ఫిలిం అవార్డ్ విన్నింగ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు నటించారు. 324 ఏళ్ళ వయస్సు ఉన్న వ్యక్తి పాత్రలో రాజ్ కుమార్ విచిత్ర గెటప్ లో కనిపించాడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన దర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.