యువకుడిపై స్త్రీల గ్యాంగ్ రేప్..!

194
Three women 'raped man, 23, for THREE days' after kidnapping man
- Advertisement -

యువకుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు మహిళలు అతని మీద గ్యాంగ్ రేప్ చేసిన వింత సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది . ఓ యువకుడిని ముగ్గురు మహిళలు అపహరించి, డ్రగ్స్ ఇచ్చి మూడు రోజుల పాటు అనేకసార్లు అత్యాచారం చేశారు. దక్షిణాఫ్రికా రాజధాని నగరం ప్రిటోరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తూర్పు ప్రిటోరియాలో 23 ఏళ్ల వ్యక్తి ట్యాక్సీలో

ప్రయాణిస్తుండగా వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురు మహిళలు అతడికి తెలియకుండా మత్తుపదార్థాలను ఇంజెక్ట్ చేసి దారి మళ్లించారు. ఆ తర్వాత ఓ గదికి తీసుకెళ్లి బంధించారు. తనతో బలవంతంగా మత్తు పానీయం తాగించి అత్యాచారం చేశారని బాధితుడు పేర్కొన్నాడు. ఇలా మూడు రోజులపాటు అతడిపై అనేకసార్లు రేప్ చేసినట్లు తెలిపాడు.
 Three women 'raped man, 23, for THREE days' after kidnapping man
తనకు మెలకువ వచ్చేసరికి ఓ గదిలో ఉన్నానని బాధితుడు తెలియజేసినట్లు పోలీస్ సర్వీస్ కెప్టెన్ కోలెట్టీ వెల్బాచ్ అన్నారు. మూడు రోజుల తర్వాత ఓ నిర్మానుష్య ప్రదేశంలో అర్థనగ్నంగా వదిలేయడంతో ఓ ట్యాక్సీ డ్రైవర్ సాయంతో ఇంటికి చేరుకున్నట్లు బాధితుడు తెలిపాడు.  దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం లైంగిక నేరాలకు పాల్పడేవారు ఎవరైనా సమానమే. దేశంలో రేప్ ఘటనలు ఏడాదికి ఓ అర మిలియన్ వరకు జరుగుతాయి.

  Three women 'raped man, 23, for THREE days' after kidnapping man

వీటిలో 20 శాతం వరకు మగవాళ్లపై జరిగినవేనని రీస్ మాన్ అనే వ్యక్తి తెలియజేశాడు. అయితే మగవాళ్లపై లైంగిక దాడుల గురించి పోలీసులు అంత సీరియస్‌గా తీసుకోరని ఆయన తెలిపాడు.  ఇక లైంగిక నేరాల విషయంలో దక్షిణాఫ్రికా పోలీసులు లింగ భేదం లేకుండా తీవ్రంగా పరిగణిస్తారు. ఈ నేరాలకు పాల్పడేవారిపై దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని కోలెట్టీ హామీ ఇచ్చారు.

- Advertisement -