IND vs ENG :టీమిండియాకు బిగ్ షాక్!

15
- Advertisement -

భారత్ ఇంగ్లాండ్ మద్య జరుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి, రెండో రోజు కలిపి 445 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 196 బ్నతుల్లో 131 ( 14 ఫోర్లు, 2 సిక్సులు ), రవీంద్ర జడేజా 225 బంతుల్లో 112 ( 9 ఫోర్లు, 2 సిక్సులు ), సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 62 ( 9 ఫోర్లు, ఒక సిక్స్ ), రవిచంద్రన్ అశ్విన్ (37), ధృవ్ జూరెల్ (46) పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డెక్కన్ 118 బంతుల్లో 133 పరుగులు చేసి సెంచరీతో కథం తొక్కాడు. దీంతో ఇంగ్లాండ్ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 238 పరుగుల వెనుకంజలో ఉంది.

టీమిండియాకు షాక్
టీమిండియాకు బౌలింగ్ విభాగంలో గట్టి షాక్ తగిలింది. రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా మ్యాచ్ నుంచి నిష్క్రమించారు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు మ్యాచ్ వదిలినట్లు బీసీసీఐ ప్రకటించింది. తాజాగా 500 వికెట్లు తీసిన టీమిండియా రెండో బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ గైర్హాజరీతో టీమిండియాకు బౌలింగ్ విభాగంలో పెను సవాల్ ఎదురు కానుంది. ప్రస్తుతం ఉన్న నలుగురు బౌలర్స్ లో సిరాజ్ గాయం కారణంగా ఎక్కువ ఓవర్స్ వేసే అవకాశం లేదు. దాంతో బుమ్రా, కుల్దిప్, జడేజాలపైనే ఆధారపడవలసి ఉంటుంది. మరి బౌలర్స్ లేకపోవడం వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి వ్యూహాలను అమలు చేసి ఇంగ్లాండ్ ను నిలువరిస్తాడో చూడాలి.

Also Read:హ్యాపీ బర్త్ డే…బాపు కేసీఆర్

- Advertisement -