‘రామారావు ఆన్‌ డ్యూటీ’.. హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ..

173
Rajisha Vijayan
- Advertisement -

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’.రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా శరత్‌ మండవ దర్శకునిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌ ప్రభుత్వఅధికారిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి మరింత పెరిగడంతో పాటుగా అంచనాలు కూడా పెరిగాయి. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఒక్క రామారావుగా ఒక్క రవితేజ క్యారెక్టరే కాదు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంది.

కథానుగుణంగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. ‘మజలీ’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దివ్యాంశ కౌశిక్‌ ఇప్పటికే ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలోని మరో ప్రధానమైన హీరోయిన్‌ పాత్రకు మలయాళ నటి రాజీషా విజయన్‌ను చిత్రబృందం ఎంపిక చేసుకుంది. రాజీషకు తెలుగులో రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తొలి చిత్రం కావడం విశేషం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. కొన్ని రోజులుగా రవితేజ, దివ్యాంశ, రాజీషలపై సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ డిఫరెంట్‌ థ్రిల్లర్‌కు ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు అసోసియేటై ఉన్నారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్యన్‌ సూర్యన్‌ ఐఎస్‌సీ ఛాయాగ్రాహకులు. ప్రవీణ్‌ కేఎల్‌ ఈ చిత్రానికి ఎడిటర్‌.

నటీనటులు: రవితేజ, రాజీష విజయన్, దివ్యాంశా కౌశిక్, నాసిర్, సీనియర్‌ నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్‌ రామకృష్ణ, ‘ఈ రోజుల్లో’ ఫేమ్‌ శ్రీ, మధుసూధన్‌ రావు, సురేఖ వాణి తదితరులు…
సాంకేతిక విభాగం
స్టోరీ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్‌: శరత్‌ మండవ
ప్రొడ్యూసర్‌: సుధాకర్‌ చెరుకూరి
బ్యానర్‌: ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, ఆర్‌టీ టీమ్‌వర్క్స్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: సామ్‌ సీఎస్‌
డీఓపీ: సత్యన్‌ సూర్యన్‌ ఐఎస్‌సీ
ఎడిటర్‌: ప్రవీణ్‌ కేఎల్‌
ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌
పీఆర్‌వో: వంశీ – శేఖర్‌

- Advertisement -