పార్లమెంట్‌లో 31 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. బిల్లులు ఇవే..

130
- Advertisement -

ఈరోజు నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైయ్యాయి. 20 రోజుల పాటు ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. కాగా ఈ సమావేశాల్లో 31 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అందులో 29 బిల్లులు కాగా.. మరో రెండు ఆర్థికాంశాలను సభలో పెట్టనుంది. అందులో ఆర్డినెన్సుల స్థానంలో ఆరు బిల్లులను తీసుకురానుంది. కీలకమైన దివాలా, విద్యుత్, డీఎన్ ఏ టెక్నాలజీ బిల్లులను ప్రవేశపెట్టనుంది.

ఇవీ బిల్లులు..

ఆర్డినెన్స్ స్థానంలో తెస్తున్న బిల్లులు..

– ట్రైబ్యునల్ సంస్కరణల (హేతుబద్ధీకరణ, సేవల షరతులు) బిల్లు 2021
– దివాలా నిబంధనల సవరణ (ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్ట్సీ) బిల్లు 2021
– దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్ బిల్లు 2021
– రక్షణ ఆవశ్యక సేవల బిల్లు 2021
– భారత వైద్య కేంద్ర మండలి సవరణ బిల్లు 2021
– హోమియోపతి కేంద్ర మండలి సవరణ బిల్లు 2021

మిగతా బిల్లులు..

– విద్యుత్ సవరణ బిల్లు 2021
– డీఎన్ ఏ సాంకేతికత (వినియోగం విధివిధానాలు) నియంత్రణ బిల్లు 2019
– కారణాంక (ఫ్యాక్టరింగ్) నియంత్రణ సవరణ బిల్లు 2020
– సహాయ పునరుత్పాదక సాంకేతికత నియంత్రణ బిల్లు 2020
– తల్లిదండ్రులు, వృద్ధుల బతుకుదెరువు, సంక్షేమ సవరణ బిల్లు 2019
– నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్ బిల్లు 2019 (ఇప్పటికే రాజ్యసభలో పాసైంది)
– నౌకాయానానికి సముద్ర సహకార బిల్లు 2021 (లోక్ సభలో పాసైంది)
– చిన్నారుల న్యాయ (రక్షణ భద్రత) సవరణ బిల్లు 2021 (లోక్ సభలో పాసైంది)
– సరోగసీ నియంత్రణ బిల్లు 2019
– బొగ్గు గనుల ప్రాంతాల/భూముల (సేకరణ, అభివృద్ధి) సవరణ బిల్లు 2021
– చార్టెడ్ అకౌంటెంట్స్, ఖర్చు, అకౌంటెంట్స్ పనులు, కంపెనీ సెక్రటరీల సవరణ బిల్లు 2021
– పరిమిత పూచీ (లయబిలిటీ) భాగస్వామ్య సవరణ బిల్లు 2021
– కంటోన్మెంట్ బిల్లు 2021
– ఇండియన్ అంటార్కిటికా బిల్లు 2021
– సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు 2021
– ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ బిల్లు 2021
– పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లు 2021
– బీమా డిపాజిట్, రుణ హామీ కార్పొరేషన్ సవరణ బిల్లు 2021
– భారత సముద్ర మత్స్యశాఖ బిల్లు 2021
– పెట్రోలియం, ఖనిజాల పైప్ లైన్స్ సవరణ బిల్లు 2021
– స్థానిక ఓడల బిల్లు 2021

- Advertisement -