రోబో సెట్‌లో జర్నలిస్టుపై దాడి

157
Rajinis 2.0 AD arrested

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘2.0’కు చిక్కులు వచ్చిపడ్డాయి. ‘రోబో 2.0’ సినిమా షూటింగ్ స్పాట్ లో ఇద్దరు మీడియా ప్రతినిధులపై దాడి జరగడం కలకలం రేపుతోంది. తమిళనాడులోని ట్రిప్లికేన్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ వేసి షూటింగ్ నిర్వహిస్తున్నారు. దీనిని కవర్ చేసేందుకు ఇద్దరు మీడియా ప్రతినిధులు వెళ్లారు. సెట్ కు సంబంధించిన ఫోటోలు తీయడంతో వారిద్దరిపైన యూనిట్ బౌన్సర్లు దాడి చేశారు.

జర్నలిస్టుల ఫిర్యాదుతో సినిమా అసిస్టెంట్ డైరెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రస్తుతం ‘2.0’ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. చిత్రీకరణతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.