‘జైలర్’గా వస్తున్న తలైవా..

194
rajini
- Advertisement -

తలైవా రజనీకాంత్- డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ఓ చిత్రం రాబోతుంది. #Thalaivar169 అనే వర్కింగ్ టైటిల్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.రజినీకాంత్ 169వ చిత్రానికి ”జైలర్” అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ పోస్ట‌ర్‌లో ఒక చైన్‌కు ర‌క్త సిక్త‌మైన క‌త్తిని వేలాడ‌దీశారు. ఈ ఒక్క పోస్ట‌ర్‌తోనే మేక‌ర్స్‌ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. టైటిల్‌ను బట్టి ఇందులో రజినీ జైలర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.

అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య‌రాయ్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ర‌మ్య‌కృష్ణ‌, శివ‌రాజ్‌కుమార్‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్ వంటి అగ్ర న‌టులు కీల‌కపాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో షూటింగ్ మొద‌లు పెట్ట‌నుంది. గత కొంత కాలంగా హిట్ అందుకోని తలైవా ఈ మూవీతోనైనా విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

- Advertisement -