త్వరలో పూర్తిస్ధాయి రాజకీయాల్లోకి రానున్న రజనీ తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.భారీ తనం, భారీ విజువల్స్ తో తెరకెక్కుతున్న సినిమా 2.0. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్షన్ నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాని తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ఈ సినిమా స్థానంలో రజినీకాంత్ నటించిన కాలా సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు వస్తున్నాయి. రోబో సినిమా స్థానంలో కాలా రావడం విశేషం. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కాలా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ డిఫరెంట్ లుక్ లో అభిమానుల్ని అలరించనుండగా ఆయన అల్లుడు ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ముంబై మురికవాడ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్ర విడుదల హక్కులను ‘2.0′ నిర్మాణ సంస్థ లైకా సొంతం చేసుకుంది. ‘2.0′ మూవీ విడుదల ఇప్పట్లో లేనట్లే అని తేలిపోయింది. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమాను జులై లేదా ఆగస్టులో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.