దీపావళికి పెద్ద ఎత్తున వస్తున్న పెద్దన్న..

85
- Advertisement -

తమిళంలో ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె అంటూ మాస్ యాక్షన్‌ను చూపించేందుకు రెడీ అయ్యారు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శివ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలుగులో పెద్దన్నగా విడుదల కానుంది. ఈ చిత్రం అన్నాచెల్లెళ్ల సంబంధం మీద తెరకెక్కుతుండటంతో పెద్దన్న అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.

ఈ సినిమాను, ఓవర్సీస్ లో భారీస్థాయిలో విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. సెకండ్ వేవ్ తరువాత ఏ ఇండియన్ సినిమా విడుదల కానన్ని ఎక్కువ లొకేషన్లలో ‘అన్నాత్తే’ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. రజనీ కెరియర్లో అక్కడ అతిపెద్ద రిలీజ్ అయ్యేలా చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

రజనీకాంత్ సరసన నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. ఇమ్మాన్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -