- Advertisement -
తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనుండగా పొలిటికల్ వాతావరణం రోజురోజుకి హీటెక్కుతోంది. ఇప్పటికే డీఎంకే,అన్నాడీఎంకే మధ్య హోరాహోరి పోరు సాగుతుండగా తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై మరింత క్లారిటీ ఇచ్చారు రజనీకాంత్.
ఉదయం అభిమాన సంఘాలతో సమావేశం అయ్యారు రజినీకాంత్. ఈ సమావేశంలో రజినీకాంత్ ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అభిమాన సంఘాలు నినాదాలు చేశాయి. మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడుస్తామని…. బీజేపీకి మద్దతు ఇస్తే మేము మీ వెంట నడువలేమంటూ స్పష్టం చేశాయి. దీంతో రజనీకాంత్ షాకయ్యారు.
2019 లోనే రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. కానీ, రాజకీయాల్లోకి రావటానికి ఇంకా సమయం ఉందని, త్వరలోనే అన్ని విషయాలు చెప్తానని గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
- Advertisement -