దాయాదుల పోరుపై స్పందించిన ఐసీసీ!

108
icc

దాయాదులు భారత్- పాకిస్ధాన్ క్రికెట్ పోరుపై స్పందించింది ఐసీసీ. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి చైర్మ‌న్‌గా ఎన్నికైన బార్‌క్లే త‌న అభిప్రాయాన్ని స్పందించారు. కొన్ని అంశాలు క్రికెట్‌తో సంబంధం లేకుండా ఉంటాయ‌ని…ఇండో, పాక్ మ‌ధ్య క్రికెట్ సిరీస్‌ను పున‌రుద్దరించే ప్ర‌య‌త్నాలు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఆ రెండు దేశాలు క్రికెట్‌ ఆడాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని, కానీ ఆ రెండు దేశాల మ‌ధ్య భౌగోళిక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్న విష‌యాన్ని గుర్తిస్తామ‌న్నారు. ఆ రెండు దేశాలు మ‌ళ్లీ క్రికెట్ ఆడేందుకు త‌మ స్థాయిలో ప్ర‌య‌త్నిస్తామ‌ని బార్‌క్లే తెలిపారు. ఆడించే ప్ర‌య‌త్నం త‌ప్ప‌, ఆ దేశాల‌పై ప్ర‌భావం చూపే నిర్ణ‌యం తాను తీసుకోలేన‌న్నారు.