రజనీ కాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమిళ సినీ పరిశ్రమలో సమాన స్థాయి కలిగిన స్టార్ హీరోలు. తన మార్క్ యాక్టింగ్, స్టైల్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థాన్ని తెచ్చిన వ్యక్తిగా రజనీని చెప్పుకుంటే, విభిన్న సినిమాలతో సరికొత్త కథాంశాలతో తెరకెక్కే సినిమాల నటుడిగా కమల్ హాసన్ గుర్తింపు పొందారు. తాజాగా చెన్నైలో జరిగిన ‘మురసోలి’ పత్రిక ప్లాటినమ్ జూబ్లీ వేడుకలకు ప్రముఖ నటులు కమల్‌హాసన్, రజినీకాంత్ హాజరయ్యారు.
డీఎంకే నేత కరుణానిధి 1942 ఆగస్టు 10న ప్రారంభించిన మురసోలి పత్రిక నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో డీఎంకే వర్గాలు ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ప్లాటినమ్ జూబ్లీ వేడుకలకు సినీ నటుడు ప్రభు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తోపాటు ఆ పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కొద్ది రోజులుగా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాట ఆసక్తికర చర్చలు నడుస్తుండటం, మరోవైపు కమల్ హాసన్ ముందు నుంచి డీఎంకే పార్టీకి మద్దతివ్వడం ,కొంతకాలంగా పాలక ఏఐఏడీఎంకేపై విమర్శలు గుప్పిస్తు బహిరంగ విమర్శలకు దిగుతున్న నేపథ్యంలో రజనీ-కమల్ ఒకే వేదికను పంచుకోనుండటం రాజకీయ వర్గాల్లో జోరు చర్చకు దారి తీసింది.