చెన్నైకి రజనీకాంత్!

38
rajinikanth

హై బీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు రజనీ ఆరోగ్య పరిస్ధితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న డాక్టర్లు …ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని తెలిపారు.

మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్రత్యేక వైద్య బృందం అపోలో ఆసుప‌త్రికి చేరుకొని ర‌జ‌నీకాంత్ ఆరోగ్యంకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నింటిని ప‌రిశీలించ‌నుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌జ‌నీకాంత్ బేగంపేట నుండి త‌న ప్ర‌త్యేక చార్ట‌ర్డ్ ఫ్లైట్‌లో సాయంత్రం చెన్నైకు వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే డిసెంబర్ 31న పార్టీ విధివిధానాలను ప్రకటిస్తానన్న రజనీ దానిని వాయిదా వేసుకునే అవకాశం ఉంది.