జనవరిలో వస్తున్న సూపర్‌స్టార్‌..

192
- Advertisement -

సూపర్‌స్టార్‌ రజినికాంత్ నటించిన ‘రోబో’ సినిమా ఎంతటి సంచలన రికార్డ్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరతెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎస్‌.శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోబోకి సీక్వెల్‌గా వస్తున్న’రోబో2.0′ సినిమాని దర్శకుడు శంకర్‌ ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నాడు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం విడుద‌ల ఏప్రిల్ 2018కి వాయిదా ప‌డింద‌ని వార్తలు వస్తున్నాయి.

Rajinikanth 2.0 release date revealed

కానీ ర‌జ‌నీ కాంత్ `రోబో 2.0` చిత్రం విడుద‌ల ఏప్రిల్ 2018కి వాయిదా ప‌డింద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై సినీ విమ‌ర్శ‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ తెర‌దించారు. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. `రోబో 2.0 విడుద‌ల ఏప్రిల్ 2018 అని వ‌స్తున్న వార్త‌లు నిజం కాదు. జ‌న‌వ‌రి 25, 2018న త‌ప్ప‌కుండా `రోబో 2.0` ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇందులో ర‌జినీ కాంత్‌, అక్ష‌య్ కుమార్‌లు న‌టించారు` అని ఆయ‌న ట్వీట్ చేశారు. `రోబో` సినిమాకు కొనసాగింపుగా వ‌స్తున్న ఈ చిత్రానికి కూడా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. అమీ జాక్సన్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

- Advertisement -