తీరనున్న బాల్‌నగర్ ట్రాఫిక్ కష్టాలు

555
Hyderabad is the fastest growing city
Hyderabad is the fastest growing city
- Advertisement -

బాలనగర్‌ ట్రాఫిక్ కష్టాలు ఇక తీరునున్నాయి. బాలనగర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న ప్రజలతోపాటు బతుకమ్మలతో ఊరేగింపుగా మహిళలు వచ్చారు.. శిల ఫలకాన్ని మంత్రి నాయిని నరసింహరెడ్డి ఆవిష్కరించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు, రవాణాను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రూ.387 కోట్లతో, ఆరు లేన్లతో బాలానగర్ ఫ్లెఓవర్‌ను నిర్మించనున్నారు.

ఈ సంధర్బంగా కేటీఆర్‌ మాట్లాడారు.  సభలో ఏం మాట్లాడాలని నా భార్యనడిగిన..  ఆమె ఒక్కటి చెప్పిందన్నారు. కృష్ణరావన్నా.. అన్న నాయిని, తలసాని, మహేందర్ రెడ్డిలు అందరు మాట్లాడిన తరువాత మాట్లేందుకు ఏం లేదని చెప్పమందనడంతో సభలో నవ్వులు విరిసాయి. అనంతరం మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ సమస్యలతో సతమవుతున్న ప్రజలకుసమస్యలు తీరిపోతాయన్నారు.

2013లో ఇదే ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిన విషయమే అన్నారు. తెలంగాణ వాళ్లు ఇతర రాష్ట్రాలను వాళ్లను వెళ్లగొడతానన్నరు.. ఈ మూడేళ్లలో ఎవరినైనా కనీసం గిచ్చినమా అని ప్రశ్నించారు. దేశంలోనే శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్‌ నెం 1 స్థానంలో ఉంది. పెట్టుబడులు రాబట్టడంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం దేశంలోనే ముందుందన్నారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచామన్నారు. ఆనాడు పరిశ్రమలు రావన్నారు.. రియల్ ఎస్టేట్ పడిపోతుందన్నారు.. ఈ రోజు భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నగరంగా హైదరాబాద్‌ నిలిచిందన్నారు. ఇది మనకు మనం ఇచ్చుకున్నది కాదన్నారు. ప్రపంచ సంస్థలు ఇచ్చాయన్నారు. ఎన్ని అనుమానాలు, ఎన్ని అపోహలు ఎదుర్కోన్నాం.. ఆనాడు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు.. కరెంటు ఉండదన్నాడు.. ప్రాజెక్టులు రావన్నాడు.. కానీ ఈ రోజు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామన్నారు.

రాబోయే 18 నుంచి 20 నెలల్లోనే బాల్‌నగర్‌ ఫ్లైఓవర్ నిర్మించి ప్రారంభిస్తామన్నారు. తొలిదశలో నాగోల్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రోను నవంబర్‌లో ప్రారంభిస్తామన్నారు. బాల్‌ నగర్‌లో రెండు స్కైవేలు నిర్మిస్తామన్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూములకు అనుమతులు రాగానే స్కైవేల నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు కేటీఆర్. ప్రతిపక్షాలకు ఏం తెలియని దిక్కు తోచట్లేదన్నారు..  రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సారధ్యంలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే విజయం సాధిస్తుందన్నారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డితోపాటు ఎమ్మెలే వివేక్, ఇతర ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ బాలానగర్ వరకు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు.

- Advertisement -