మళ్లీ పెంచేస్తోందట !

231
Enthavaraku ee prema release date
Enthavaraku ee prema release date
- Advertisement -

అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్ధకాలం నుంచి వెండితెర మీద వెలిగిపోతోంది. ఎంతోమంది కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేస్తున్నా ఈ చందమామ హవా ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ఒకవైపు ఫేస్ లో.. బాడీలో ఒకప్పటి గ్లో పోయిందన్న విమర్శలు.. మరోవైపు వరుస ఫ్లాపులు.. దీంతో కొన్ని నెలల కిందట కాజల్ అగర్వాల్ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలిసిందే. డిమాండ్ తగ్గిన ఆ సమయంలోనే రానా లాంటి స్టార్ ఇమేజ్ లేని హీరోతో.. తేజ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో కాజల్ సినిమా కమిటయ్యేసరికి ఆమె కెరీర్ చరమాంకానికి వచ్చేసిందని.. కాజల్ ఇంకెన్నో రోజులు ఇండస్ట్రీలో కనిపించకపోవచ్చని అంచనాలు కట్టేశారు జనాలు. ఐతే అక్కడ కట్ చేసి.. వర్తమానంలోకి వస్తే కాజల్ డేట్ల కోసం నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి.

Kajal-Agarwal-sexy-actress-new-looks

ఖైదీ నెంబర్ 150తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కాజల్.. ఇటీవల చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా కాజల్ తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. తమిళంలో అజిత్ సరసన ‘వివేగం’ (తెలుగులో వివేకం) సినిమా చేసింది. ఈ సినిమా ఈ నెల 26వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విజయ్ జోడీగా చేసిన ‘మెర్సెల్’ అక్టోబర్లో విడుదల కానుంది. ఈ రెండింటిపై భారీ అంచనాలు వున్న నేపథ్యంలోతన పారితోషికాన్ని పెంచాలనే ఆలోచనలో కాజల్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ కల్యాణ్ రామ్ తో ఎమ్మేల్యే సినిమాలో చేస్తోంది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఇక్కడ కూడా రెమ్యునరేషన్ పెంచడానికి రెడీగా ఉందట. మొత్తానికి కాజల్ పక్కా ప్లానింగ్ తోనే ఉందని ఫిల్మ్‌నగర్లో వినిపిస్తోంది.

- Advertisement -