కాలా…రజనీ ఇరగదీశాడు..!

242
kala teaser
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్, పా. రంజిత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం కాలా. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని వండర్ బార్ ఫిలింస్ పతాకంపై రజినీ అల్లుడు ధనుష్ నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద కొలాహలం కనిపిస్తోంది. రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సినిమాలో రజనీ,నానా పటేకర్ నటన హైలైట్‌గా నిలిచిందని ఫ్యాన్స్‌ ట్వీట్స్ చేస్తున్నారు. ప్రతీ ఫ్రేమ్‌లో రజనీ చరిష్మా, స్క్రీన్ ప్రజెన్స్ వెండితెర మీద గ్రాండ్‌గా కనిపిస్తుందని తెలిపారు. చిత్రంలోని కలర్ బ్యాలెన్స్, యాక్షన్ సీన్లు సూపర్బ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. ఇక టెక్నికల్‌గా కాలా చిత్రం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. దక్షిణాదిలో ఇప్పటివరకు ఇంతగా భావోద్వేగానికి గురిచేసే చిత్రం రాలేదని పాజిటివ్ రేటింగ్స్ ఇస్తున్నారు.

పా రంజిత్ దర్శకత్వంలో ఎలాంటి లోపాలు కనిపించవని చెబుతున్నారు. చిత్రంలో ఏ ఒక్క సన్నివేశం కూడా అనవసరం అనిపించదు. సినిమా భారాన్ని మొత్తం రజనీకాంత్ భుజాన వేసుకున్నాడని….డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండటం ఖాయమని ట్రేడ్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.

- Advertisement -