‘ సైరా’లో చిరంజీవి ఫ‌స్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

247
syeraa

మెగాస్టార్ చిరంజివి హీరోగా న‌టిస్తున్న 151వ సినిమా సైరా. ఈసినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చారిత్ర‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈసినిమాకు చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీస్తున్నారు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించి 30శాతం వ‌ర‌కూ షూటింగ్ పూర్త‌యిన‌ట్టు తెలుస్తుంది. ఈసినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్, త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి ప‌లువురు ప్ర‌ముఖ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

syeraa

ఇప్ప‌టివ‌ర‌కూ ఒక షెడ్యూల్ మాత్ర‌మే పూర్తి చేసుకున్న ఈసినిమా..తాజాగా రెండ‌వ షెడ్యూల్ ను నేటి నుంచి ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తుంది. హైద‌రాబాద్ లోని ఓ స్టూడియోలో ఈసినిమాకు సంబంధించిన సెట్ ను కూడా వేశారు. దింతో 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొన‌సాగ‌నుంది. సినిమాలో ప్ర‌ధానమైన పాత్ర‌ల‌కి సంబంధించిన కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను ఈసెట్ లో చిత్రీక‌రించ‌నున్నారు. నేటినుంచి ఈషెడ్యూల్ లో చిరంజీవితోపాటు ప‌లువురు ఈషూటింగ్ పాల్గోన‌నున్నారు.

chiru, surendarreddy

గ‌తంలో ఈసినిమాకు షూటింగ్ కు సంబంధించి న ఫోటోల‌ను అమితాబ్ పోస్ట్ చేయ‌డంతో ఆ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. అందులో అమితాబ్, చిరంజీవి, న‌య‌న‌తార లుక్ లు మ‌న‌కు క‌నిపించాయి. అయితే సినిమా బృందం మాత్రం అధికారికంగా ఎవ‌రి ఫ‌స్ట్ లుక్ ల‌ను విడుద‌ల చేయ‌లేదు. చిరంజీవి పుట్టిన‌రోజున ఆగ‌స్టు 22వ తేదిన అధికారికంగా చిరంజీవి ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్నారు. సైరా ఫ‌స్ట్ లుక్ తో చిరంజీవి త‌న అభిమాను బ‌ర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వ‌నున్నాడు. ఇక సినిమాను వ‌చ్చే సమ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.