- Advertisement -
జైపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 5 వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రాహుల్ (15) నిరాశపర్చినా సూర్యకుమార్ యాదవ్ (62) సిక్సులు, ఫోర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. కెప్టెన్ రోహిత్ (48) రాణించడంతో భారత్ విజయం లాంఛనమైంది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు తీయగా సౌథీ, శాంట్నర్, మిచెల్ తలో వికెట్ సాధించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 164 పరుగులు చేసింది. గుప్టిల్ (70), చాప్‌మన్ (63) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 2, అశ్విన్ 2 వికెట్లు తీయగా… సిరాజ్, చాహర్ చెరో వికెట్ తీశారు.
- Advertisement -