రాజస్థాన్‌ సభలో రచ్చ రచ్చ…

15
- Advertisement -

రాజస్థాన్ ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో గందరగోళానికి గురైయ్యారు. సీఎం అశోక్‌ గెహ్లట్‌ వద్దే ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే ప్రస్తుత బడ్జెట్‌ను కాక గత సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో విపక్ష పార్టీలు మండిపడ్డారు. ఎనిమిది నిమిషాల తర్వాత ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్‌ మంత్రి ఒకరు ఆ తప్పిదాన్ని గుర్తించి ప్రసంగాన్ని ఆపించారు. శుక్రవారం జరిగిన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఘోర తప్పిదం జరిగింది.

కాంగ్రెస్ మంత్రి మహేష్‌జోషీ గుర్తించి సీఎంకు తెలయజేశారు. ఈ పరిణామంతో బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే కొత్త పద్దులోని విషయాలు లీక్ అయ్యాయా?అని నిలదీశారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా మాజీ సీఎం వసుంధర రాజే స్పందిస్తూ…నేను సీఎంగా ఉన్నప్పుడు ఒకటికిరెండుసార్లు ప్రతులను పరిశీలించకునేదాన్ని.కానీ ఇలా పాత బడ్జెట్‌ను చదివేవారి చేతిలో రాష్ట్రం ఎంత సురక్షితంగా ఉందో మీరే ఊహించుకోగలరు అని అన్నారు. నిరసనల అనంతరం కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి…

నూతన సచివాలయంపై బండి సంచలన వ్యాఖ్యలు

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం: కేసీఆర్

గ్రీన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన స్పీకర్‌

- Advertisement -