టాస్ గెలిచిన రాజస్థాన్..

117
kkr

ఐపీఎల్ 13లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లో నేడు కోల్ కతా రైట్ రైడర్స్, రాజాస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా జట్టులో ఆండ్రీ రస్సెల్ తిరిగొచ్చాడు. పేసర్ లాకీ ఫెర్గుసన్ ను తప్పించి శివమ్ మావిని జట్టులోకి తీసుకున్నారు. ఇక రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. స్టోక్స్ భీకర ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు కలిసొస్తోంది.

జట్ల వివరాలు:

రాజాస్థాన్ రాయల్స్: రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, వరుణ్ అరోన్, కార్తీక్ త్యాగి.

కోల్ కతా రైట్ రైడర్స్: శుభమాన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, ఆండ్రే రస్సెల్, శివం మావి, ప్యాట్ కమ్మిన్స్, కమ్లేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి.