పట్టభద్రులు ఓటు హక్కు నమోదుచేసుకోండి: మంత్రి ఎర్రబెల్లి

155
errabelli

పట్టభద్రులందరూ ఓటు హక్కు నమోదుచేసుకుని…ఓటు హక్కును వినియోగించుకునే ముందు విశ్లేషించుకోవాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.మహబూబాబాద్, మరిపెడ బంగ్లా లో వేర్వేరుగా జరిగిన మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గ స్థాయి వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశాలకి సత్యవతిరాథోడ్‌తో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్,తదితరులు హాజరయ్యారు.

అభ్యర్థుల గుణగణాలు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ లను పరిశీలించడం మరచిపోకండన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎవరు అమలు చేస్తున్నారో చూడండి..కరోనా కష్ట కాలంలో ప్రజలను, రైతులను ఆదుకున్నది ఎవరో మీకు తెలుసన్నారు. అప్పులు చేసైనా… రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను,రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం కెసిఆర్ కృషి చేస్తున్నారు…రుణాల మాఫీ, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడులు ఇస్తున్నది సిఎం కెసిఆర్ అన్నారు.

ఓట్ల కోసం వచ్చే బీజేపీ ని నిలదీయాలి..పన్నులు మనం కడితే, మన వాటా నిధులు కూడా ఇవ్వడం లేదు అన్నారు. ఇత్తేసి పొత్తు కూడినట్లు… మన రాష్ట్ర ప్రభుత్వం 38 లక్షల మందికి 11 వేల కోట్లు పెట్టి పెన్షన్లు ఇస్తుంటే కేవలం 7 లక్షల మంది కి 200 రూపాయల చొప్పున 100 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తుందన్నారు. మొత్తం తామే ఇస్తున్నట్లుగా పోజు కొడుతున్నాయి….దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయాలు చేసే బీజేపీ ని తరిమి కొట్టాలన్నారు.

రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు వంటి పథకాలు ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా?…ఇలాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న మొనగాడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ తలలో నాలుకలా పని చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మనమంతా కలిసి గెలిపించుకోవాలని….మన మహబూబాబాద్, డోర్నకల్ రూపురేఖలను మార్చుకోవాలన్నారు. మీ నియోజకవర్గాలకి సాగునీరు సహా, అన్ని పథకాలు ముందుగా మీకే అందిస్తున్నాం అన్నారు.