టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్..

161
rcb
- Advertisement -

ఐపీఎల్-13లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. బెంగళూరు జట్టులో షాబాజ్ అహ్మద్, గుర్ కీరత్ సింగ్ మాన్ లను తీసుకున్నారు. శివం దూబే, మహ్మద్ సిరాజ్ లను తప్పించారు. షాబాజ్ అహ్మద్‌కు ఇదే ఐపీఎల్ అరంగ్రేట మ్యాచ్ కావడం విశేషం.

పాయింట్ల పట్టికలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు బెంగళూరు జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లలో నెగ్గగా, రాజస్థాన్ జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో మరోసారి గెలువాలని పట్టుదలతో ఉంది కొహ్లీ సేన.

జట్ల వివరాలు:

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: అరోన్ ఫించ్, దేవదత్ పడిక్కల్, విరాట్ కొహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), గురుకీరట్ సింగ్ మాన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, షాబాజ్ అహ్మద్, ఇసురు ఉడానా, నవదీప్ షైని, యుజ్వేంద్ర చాహల్.

రాజస్థాన్ రాయల్స్: బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజు శామ్సన్, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి.

- Advertisement -