సన్ రైజర్స్‌ హైదరాబాద్‌పై రాజస్థాన్ విజయం..

155
Rajasthan Royals
- Advertisement -

ఐపీఎల్-13లో ఆదివారం ఆసక్తికర మ్యాచ్‌ జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఘోర పరాజం పాలైంది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్‌పై విజయం సాధించింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు కావాల్సి ఉండగా, ఆ ఓవర్ ఐదో బంతికి పరాగ్ సిక్స్ కొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం ఖాయమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

మనీష్ పాడే 54, డేవిడ్ వార్నర్ 48 ఆకట్టుకున్నారు. విలియమ్సన్ 22 పరుగులతో పరవాలేదనిపించాడు. ఎన్నో అంచనాల మధ్య బ్యాటింగ్‌కు దిగిన బెయిర్ స్టో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే.. కెప్టెన్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 15వ ఓవర్లలో వార్నర్ ఔటవడంతో స్కోర్ బాధ్యత పాండేపై పడింది. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 18 ఓవర్లో పాండే పెవిలియన్‌కు చేరాడు. ఆఖరులో ప్రియమ్ గార్గ్ సిక్స్, ఫోర్ కొట్టడంతో సన్ రైజర్స్ స్కోర్ 158కి చేరింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగీ, ఉనద్కత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

- Advertisement -