దుబ్బాక ఎన్నికల్లో NRIలు క్రియాశీల పాత్ర పోషించాలి..

205
Minister harish rao
- Advertisement -

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 30 దేశాలకు పైగా ఎన్నారై ప్రతినిధులు హాజరైయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో దుబ్బాక ఎన్నికల ప్రచార సరళిని వివరిస్తూ.. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నారైల పాత్రపై మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. దుబ్బాకలో జరిగిన అభివృద్ధి గురించి ఎన్నారైలకు మంత్రి హరీష్ రావు వివరించారు. ఉద్యమం నుండి నేటి వరకు ఎన్నారైలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పది. టీఆర్ఎస్ ఎన్నారైలు సోషల్ మీడియాలో గ్లోబెల్ ప్రచారాలని తిప్పి కొట్టాలి. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో ఎన్నారైలు అందరూ క్రియాశీలక పాత్ర నిర్వహించాలి. నేను కూడా అమెరికాకు, యూకే కు రావడం జరిగింది.. అందరం కలిసి పని చేశాం. తెలంగాణ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా మేధావుల అందర్నీ కూడగట్టడంలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పది. ఎన్నారైల పాత్రను కూడా ఎప్పుడు మరిచిపోలేము. దుబ్బాక పూర్తిస్థాయిలో వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం.. చిన్న మున్సిపాలిటీ. దుబ్బాక నియోజకవర్గం మొన్ననే కొత్త మున్సిపాలిటీగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భావం చెందింది. దుబ్బాక ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం.. రైతుల ఆత్మహత్యలు ఆకలిచావులు.. వలసలు ఇబ్బందులతో ఉన్న దుబ్బాక ప్రాంతం త్రాగునీరు కోసం కూడా ఎంతో అల్లాడిపోయే. కానీ రామలింగన్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో దుబ్బాకలో ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించారు.

ఇప్పడు ఎన్నికల ప్రచారంలో దుబ్బాక ప్రాంతంలో ప్రతి మహిళ యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది. మహిళలు అందరూ మాకు మంచి నీటి సమస్య పరిష్కారం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి కూడా మంచి నీళ్లు వస్తున్నాయి ఎండా కాలంలో కూడా నీళ్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి నీళ్లు ప్రతి ఇంటికి వస్తున్నాయి మహిళలు చెప్తున్నారు. మరి 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. 20 సంవత్సరాలు తెలుగుదేశం బిజెపి ఉమ్మడి పార్టీలు అధికారంలో ఉండి త్రాగు నీరు కూడా ఇవ్వలేదని మంత్రి హరీష్‌ మండిపడ్డారు. ఏ ప్రభుత్వం కూడా దుబ్బాక అభివృద్ధి చేయలే.. త్రాగునీరు అందించలేదు.. కానీ రామలింగన్న నాయకత్వంలో సిఎం కేసీఆర్ ఆశీస్సులతో ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించాం.. దుబ్బాకకు శాశ్వత పరిష్కారం చూపించాం.. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నినాదమే ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగు నీరు ప్రతి ఇంటికీ త్రాగునీరు అనే అంశం ఇప్పటికే పూర్తయిందన్నారు.

సాగునీరు కూడా త్వరలో పూర్తవుతుంది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో దుబ్బాకలోని చెరువులు, కుంటలు అని నింపడం జరిగింది. చెక్ డ్యామ్ లు నిర్మించడం జరిగింది.ఏ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు ఒకే సంవత్సరంలో రెండు పంటలు పండించే రోజులు వచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షా 30వేల ఎకరాలకు సాగునీరు అందుతున్న ఏకైక నియోజక వర్గం దుబ్బాక. 60వేల ఆసరా పెన్షన్స్ , 78 వేల మందికి రైతు బంధు ఇస్తున్నం అని తెలిపారు. కాంగ్రెస్ బిజెపి పాలిత ప్రాంతాల్లో కూడా ఈవిధంగా బీడీ పిన్షన్స్ ఇవ్వటం లేదు..కానీ దుబ్బాక నియోజకవర్గంలో 20వేల మందికి బీడీ పిన్షన్స్ ఇస్తున్నామన్నారు మంత్రి హరీష్‌. ఇక దేశంలోనే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో మీ బంధువులు, మీ స్నేహితులు, చిన్ననాటి మిత్రులు సుజాత గెలుపుకు మీ అందరూ సహకరించాలి.

రామలింగన్న అకస్మాత్తుగా మరణించడం పట్ల, ఒక ఉద్యమకారునిగా పని చేసిన ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన సతీమణి సోలిపేట సుజాత అందరికీ సుపరిచితురాలే.. సుజాత ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో కూడా ప్రతి గడపగడపకు తిరిగారు ప్రతి ఎన్నికల్లో రామలింగన్న తరఫున ప్రతి గ్రామగ్రామాన తిరిగిన వ్యక్తి ఆమె. లింగన్నని కలవడానికి వచ్చిన వ్యక్తులను కార్యకర్తలను ఎంతో ఆప్యాయతతో ప్రేమతో పలకరించే వ్యక్తి అందరితో ప్రతి కార్యకర్తతో మాట్లాడే వ్యక్తి సుజాత అక్క.. దుబ్బాకలో ప్రతి వ్యక్తిని పేరుతో పిలవగలిగిన వ్యక్తి సుజాత అక్క అన్నారు మంత్రి హరీష్‌.

ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసారి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, సిక్కా చంద్రశేఖర్, టీఆర్ఎస్ న్యూజీలాండ్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి కొస్నా మరియు 30 కి పైగా దేశాల ఎన్నారై టీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -