పంజాబ్ పై రాజస్ధాన్ గెలుపు

191
rr
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్ రాయల్స్ విజయం సాధించింది. పంజాబ్ విధించిన 186 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 186 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ బెన్‌స్టోక్స్‌(50) తొలి ఓవర్‌ నుంచే ఎదురుదాడికి దిగాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు అదిరే ఆరంభం అందించాడు. అందరి బౌలింగ్‌లో విరుచుకుపడిన స్టోక్స్‌ 24 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.

స్టోక్స్ ఔటైనా తర్వాత వచ్చిన సంజు శాంసన్ కూడా అదరగొట్టాడు. 25 బంతుల్లో 3 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. దీంతో రాజస్ధాన్ విజయం దాదాపు ఖాయం కాగా మిగితా పనిని పూర్తి చేశారు స్మిత్ (31 ),బట్లర్‌ (22).

అంతకముందు టాస్ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలిన గేల్ సునామీతో భారీ స్కోరు సాధించింది. క్రిస్‌గేల్‌(99: 63 బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు) తృటిలో సెంచరీని మిస్ చేసుకోగా కేఎల్ రాహుల్ (46) రాణించడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -