బిగ్ బాస్ 4….ఎపిసోడ్ 55 హైలైట్స్

108
amma rajashekar

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 55 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 55వ ఎపిసోడ్‌లో ఈ 55 రోజుల జర్నీని చూపించి ఇంటి సభ్యులను ఎమోషన్‌కు గురి చేశారు బిగ్ బాస్. తర్వాత సొహైల్- అఖిల్ మధ్య తీవ్ర వాగ్వాదం అనంతరం వారు కలిసిపోవడంతో ఎపిసోడ్ ముగిసిపోయింది.

అరియానాను సర్ ప్రైజ్ చేస్తూ ఆమెను స్టోర్ రూంలోకి పిలిచి ఆమెకు ఇష్టమైన చింపాంజీ బొమ్మను పంపించారు. దీంతో ఎమోషన్‌తో తెగ ఏడ్చేసింది అరియానా. ఆమెను ఓదార్చుతూ ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు అవినాష్. మోనాల్ విషయంలో ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ కనిపించే అఖిల్-అభిలు కలిసి ముచ్చట్లు పెట్టారు. మరోవైపు సొహైల్-మెహబూబ్‌లు కూడా గేమ్‌పై ఫోకస్ పెట్టాలని ఛాన్స్ దొరికితే బ్యాడ్ చేయడానికి రెడీగా ఉంటున్నారని తుగ బాధపడ్డారు.

మోనాల్ గురించి అభి దగ్గర ప్రస్తావన తెచ్చిన అఖిల్….అభి నువ్ ఇప్పుడు చెప్తున్న పద్దతిలో అప్పుడు చెప్పి ఉంటే మోనాల్ అర్థం చేసుకుని ఉండేది..కానీ నీ టోన్ అప్పుడు డిఫరెంట్‌గా ఉంది.. అందుకే ఆమెకు తప్పుగా అర్థమైంది అంటూ కూల్‌గా అభికి అర్ధం అయ్యేలా చెప్పాడు అఖిల్. అయితే అభి మాత్రం వెనక్కి తగ్గలేదు …మోనాల్‌కి అలా అర్థమైతే నేను ఆమెకు క్షమాపణ చెప్పాలని లేదు.. నా గురించి నేను మాట్లాడుకోవడానికి నాకు హక్కు ఉంది.

ఆమె హర్ట్ అయ్యిందంటే నేను హర్ట్ చేయలేదు.. కానీ మోనాల్ వల్ల నేను హర్ట్ అయ్యా అంటూ మోనాల్, అఖిల్ దగ్గర నుంచి లేచి వెళ్లిపోయాడు అభిజిత్.ఇంటి సభ్యుల మధ్య ఫిటింగ్ పెడుతూ మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అఖిల్-మోనాల్, అరియానా-అవినాష్, అభిజిత్-హారిక, లాస్య-రాజశేఖర్,మెహబూబ్-సొహైల్‌లను జంటలుగా విడగొట్టి…..ఒక్కో జంటను మొదట కన్ఫెషన్ రూంకి పిలిచి గజిబిజి జంట, బద్దకస్తుల జంట,అబద్దాల కోరుల జంట, అహంకారుల జంట, జీరో టాలెంట్ జంట ఇది ఏ జంటకు సరిపోతుందో నేమ్ బోర్డు పెట్టాలని తెలిపారు.

గజిబిజి జంటగా లాస్య-అమ్మా రాజశేఖర్‌, బద్దకస్తుల జంటగా అవినాష్, అరియానా,అబద్దాల కోరుల జంటగా మెహబూబ్, సొహైల్‌, అహంకారుల జంటగా అఖిల్-మోనాల్‌,జీరో టాలెంట్ జంటగా అభిజిత్,హారికలను ఎంపిక చేశారు.బోర్డుల ప్రకారం జీరో టాలెంట్ జంట అభి, హారికలు బిగ్ బాస్ పిలిచిన ప్రతిసారీ తమ టాలెంట్‌ని నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గజిబిజి జంట లాస్య-రాజశేఖర్‌లు బిగ్ బాస్ పిలిచిన ప్రతిసారీ వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో మునగాల్సి ఉంటుందని కోరారు. అబద్దాల కోరుల జంట సొహైల్-మెహబూబ్‌లు.. తాము అబద్ధాల కోరులు జంట కాదని నిరూపించుకోవడం కోసం.. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు నిజాలు చెప్పాలని కోరారు . అలాగే బద్దకస్తుల జంట అవినాష్- అరియానాలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని.. ఎవరు ఏం పనిచెప్పినా చేయాలని కోరారు. అహంకారుల జంట అఖిల్-మోనాల్‌లు వాళ్ల అహంకారం ప్రదర్శించకూడదని.. ఇంటి సభ్యులు ఎంత విసిగించినా యాటిట్యూడ్ చూపించకూడదని చెప్పారు.

తనని అబద్దాల కోరు అని అఖిల్ అనడంతో హర్ట్ అయ్యాడు సొహైల్. నేను లేనిది ఏమన్నానో చెప్పు అంటూ అఖిల్‌తో వాదనకు దిగారు. ఓ దశలో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా ఏం చెప్పాలో తెలియక అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అప్పటివరకు ఉన్న ఘర్షణ వాతావరణానికి చెక్ పడింది.ఇంటి సభ్యులు ఏం చేసినా కోప్పడకూడదని సౌమ్యంగా ఉండాలని బిగ్ బాస్ చెప్పడంతో అఖిల్-మోనాల్‌లకు కోపం తెప్పించడానికి తెగ ప్రయత్నించారు ఇంటి సభ్యులు. వాళ్లిద్దర్నీ స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేశారు. అప్పటికీ వాళ్లు నవ్వుతూనే ఉండటంతో మోనాల్‌‌కి కోపం తెప్పించేందుకు

ఆమెపై గుడ్డు కొట్టడానికి ప్రయత్నించారు. అఖిల్‌…మోనాల్‌కు రక్షణగా నిలిచే ప్రయత్నం చేయగా అమ్మరాజశేఖర్ వారిపై గుడ్డు పోశాడు. ఇక తర్వాత బిగ్ బాస్ 55 రోజుల జర్నీని చూపిస్తూ ఇంటి సభ్యులను ఎమోషన్‌కు గురిచేశాడు బిగ్ బాస్. దీంతో ఎపిసోడ్ ముగిసింది.