ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు ఫ్యాన్స్‌కు క్రికెట్ మజాను రుచిచూసింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 400కి పైగా స్కోరు నమోదుకాగా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రాజస్థాన్ గెలుపొందింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా…19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 85), ఫించ్ (28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 58) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అయితే వీరికి మిగితా బ్యాట్స్‌మెన్ నుండి సహకారం కరువవడంతో కోల్ కతాకు ఓటమి తప్పలేదు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 217 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న బట్లర్ మరోసారి చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103) సెంచరీతో కదం తొక్కగా శాంసన్ (38), హెట్‌మయెర్ (26) సత్తా చాటారు. బట్లర్ మెరుపులకు తోడు స్పిన్నర్ చాహల్ (5/40) హ్యాట్రిక్‌తో చెలరేగడంతో రాజస్థాన్ గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా చాహల్ నిలిచాడు.