దూబే..సీఎస్‌కేకు కీలకం కానున్నాడా?

6
- Advertisement -

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రదర్శన నిరాశాజనకంగా నిలిచింది. 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలతో తొలిసారిగా చివరి స్థానంలో నిలిచింది. అంతేకాదు, వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోవడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది.

ఈసారి సీఎస్‌కే యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. మినీ వేలంలో కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ వంటి యువ బ్యాటర్లను భారీ ధరకు తీసుకుంది. వీరి పవర్ హిట్టింగ్ సామర్థ్యం జట్టుకు బలం కావొచ్చు.

అలాగే సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు జట్టుకు స్థిరత్వాన్ని ఇస్తున్నారు.శివమ్ దూబే – జట్టుకు కీలక ఆటగాడు. స్పిన్ బౌలింగ్‌పై దాడి చేయడం,చివర్లో వేగంగా పరుగులు చేయడం దూబే ప్రత్యేకత. భారత జట్టులో ఈ పాత్రను దూబే సమర్థంగా నిర్వహించాడు.

దీంతో దూబేపై భారీ ఆశలు పెట్టుకుంది సీఎస్‌కే. దూబే రాణిస్తే సీఎస్‌కే మళ్లీ టైటిల్ పోటీలో నిలబడే అవకాశం ఉందని ఆ జట్టు యాజమాన్యం అంచనా వేస్తోంది.

Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

- Advertisement -