పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్దత బిల్లు

5
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కీలక పరిణామంగా, అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు–2026” పేరుతో రూపొందించిన ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోం శాఖ లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే సమాచారం ఇచ్చింది.

బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉండగా, అనంతరం వెంటనే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రతిపాదించనున్నారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వడం, విభజన చట్టంలో అవసరమైన సవరణలు చేయడం వంటి అంశాలు ఈ బిల్లులో ఉండే అవకాశముంది.

Also Read:ఢిల్లీ లిక్కర్ కేసు..కీలక పరిణామం

ఈ పరిణామం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశముండగా, పార్లమెంట్‌లో ఈ అంశంపై విస్తృత చర్చ జరగనుంది.

- Advertisement -