- Advertisement -
రాజస్థాన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌లో ముసలం రాజుకుంది. సీఎం గారు వెంటనే మంత్రి పదవి నుంచి తనకు విముక్తి కల్పించండి అని ఓ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో క్రీడలు, యువజన వ్యవహారాలు, స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ రిలీఫ్ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు అశోక్ చంద్నా.
తన పరిధిలోని శాఖల్లో ఆ ఉన్నతాధికారి జోక్యం మితిమీరిపోయిందని, గౌరవం లేనిచోట తాను ఉండలేను అని ఓ మంత్రి.. సీఎంకు విజ్ఞప్తి చేశాడు. తన శాఖలన్నింటిని ఆ అధికారికే ఇచ్చేయండి అంటూ అసహనం వ్యక్తంచేశారు.
- Advertisement -