- Advertisement -
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 10 మంది స్వతంత్ర్య ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
సమావేశానికి హాజరుకావాలంటూ ఇప్పటికే విప్ జారీ చేయగా డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తో పాటు ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇక పరిస్ధితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాల రంగంలోకి దిగారు.
తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు సచిన్ పైలట్. సీఎల్పీ సమావేశం జరగడానికి కొద్ది నిమిషాల ముందే తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ వేచి చూసే ధోరణిని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
- Advertisement -