ఎన్నికలు దగ్గర పడుతున్న వేల బీజేపీ సంస్థాగత మార్పులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల వారీగా పార్టీ అధ్యక్షుల మార్పు చేపట్టడంతో పాటు కీలక పదవుల విషయంలో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చింది. దీంతో కమలం పార్టీ నూతనోత్సాహంతో ఎన్నికలకు సంసిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ కూడా ప్రక్షాళన వైపు ఆలోచిస్తుందా ? అనే అవుననే సమాధానాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని చూస్తున్న హస్తం పార్టీ.. విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాలలో నేతల మద్య పెరుగుతున్న విభేదాల కారణంగా ప్రక్షాళన పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా రాజస్తాన్, తెలంగాణ వంటి రాష్ట్రాలలో ప్రస్తుత అధ్యక్షుల విషయంలో అసమ్మతి సెగలు ఎప్పటి నుంచో రగులుగుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ సీనియర్ నేతలు ఏ స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారో విధితమే. రేవంత్ రెడ్డి పార్టీ చీఫ్ గా ఎన్నికైనప్పటి నుంచి హస్తం పార్టీలోని చాలమంది సీనియర్స్ పార్టీలో అంటి అంటనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఎన్నోమార్లు నేతల మద్య సక్యత పెంచేందుకు అధిష్టానం ప్రయత్నించినప్పటికి పెద్దగా ఫలించలేదు.
Also Read:పవర్ స్టార్ మానియా..
ఇక రాజస్తాన్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే కర్నాటక ఎన్నికల విజయం తరువాత నేతల మద్య విభేదాలు తగ్గినట్లే కనిపించిన.. అవి పై పైనే అని చెప్పక తప్పదు. ఇక ఏడాది చివర్లో రాజస్తాన్, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మాదిరి తాము కూడా అధ్యక్ష పదవి మార్పు చేపడితే ఎలా ఉంటుందనే దానిపై హస్తం హైకమాండ్ ఆలోచిస్తునట్లు నేషనల్ మీడియా టాక్. మరి హస్తం పార్టీ కూడా బీజేపీ వ్యూహాన్ని ఫాలో అయి సంస్థాగత మార్పులకు శ్రీకారం చూడుతుందేమో చూడాలి.
Also Read:ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా భూపాల్ రెడ్డి..