అలా జ‌ర‌గ‌డం చాలా బాధించిందిః అజింక్యా ర‌హానే

260
ajenkya rahane
- Advertisement -

ఐపిఎల్ లో నేటితో క్యాలీఫైర్ మ్యాచ్ లు ముగిసిపోయాయి. నిన్న జరిగిన కొల్ క‌త్తా వ‌ర్సెస్ రాజ‌స్ధాన్ మ్యాచ్ లో రాజ‌స్ధాన ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఇక ఎలిమినేట‌ర్ 2 మ్యాచ్ లో కోల్ క‌త్తా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఎలిమినేట‌ర్ 1 లోనే ఫైనల్ లో బెర్త్ క‌న్ఫామ్ చేసుకుంది చైన్సై సూప‌ర్ కింగ్స్. రేపు జ‌ర‌గ‌బోయే మ్యాచ్ లో ఎవ‌రు గెలిచి ఫైన‌ల్ కు వెళ‌తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. నిన్న జ‌రిగిన ఎలిమేట‌ర్ మ్యాచ్ లో రాజ‌స్ధాన్ రాయ‌ల్స్ టీం ఓడిపోవ‌డం తీవ్ర నిరాశ కు గురిచేసింద‌న్నారు కెప్టెన్ అజింక్యా ర‌హానే. త‌మ ముందు ఉన్న లక్ష్యం పెద్ద‌దేమి కాద‌న్నారు. కొల్ క‌త్తా బౌల‌ర్లు మెరుగున‌ బౌలింగ్ చేయ‌డం వ‌ల్లే తాము ఓడిపోయామ‌న్నారు.rajastan royals team captain ajenkya rahane feel to loss match in ipl..

మొద‌ట్లోనే కోల్ క‌త్తా టీంలోని కీల‌క‌ ఆట‌గాళ్ల‌ను ఔట్ చేసి స‌గం వ‌ర‌కు గెలిచామ‌న్నారు.దినేశ్ కార్తిక్, శుబ్ మాన్ గిల్ లు చ‌క్క‌టి భాగ‌స్వామ్యాన్ని క‌న‌బ‌ర‌చి మ్యాచ్ ను గెలుపించడంలో కీల‌క పాత్ర పోషించార‌న్నారు. మ‌రోవైపు కోల్ క‌త్తా బ్యాట్స్ మెన్ క్యాచ్ ను వ‌దిలేసి అత‌నికి లైఫ్ ఇవ్వ‌డం వ‌ల్ల కూడా తాము విఫ‌లం చెందామ‌న్నారు. ర‌సెల్ ను అప్పుడే ఔట్ చేసి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్ల‌మ‌న్నారు. మా ముందు ఉన్నది సాధార‌ణ ల‌క్ష్య‌మే అయినా దాన్ని చేధించ‌డంలో తాము విఫ‌లం చెందామ‌న్నారు. క్యాలీఫైర్ మ్యాచ్ లో తాము ఓడిపోవ‌డం నన్ను చాలా బాధించింద‌న్నారు రాజ‌స్ధాన్ కెప్టెన్ ర‌హానే.rajastan royals team captain ajenkya rahane feel to loss match in ipl..ఇక నిన్న‌టి మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్ క‌త్తా టీం 20ఓవ‌ర్ల‌లో 169 ప‌రుగులు చేసి 7వికెట్లు కోల్పోయింది. రాజ‌స్థాన్ ల‌క్ష్యం 170 ప‌రుగులు. నిర్ణిత ఓవ‌ర్ల‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయి 144ప‌రుగుల‌కే ప‌రిమిత‌మ‌య్యారు రాజ‌స్ధాన్ రాయ‌ల్స్ టీం. దింతో 25 ప‌రుగుల తేడాతో రాజ‌స్ధాన్ సెమిఫైనల్ లోకి అడుగుపెట్టింది. రేపు జ‌రిగే క్వాలిఫైర్ మ్యాచ్ లో హైద‌రాబాద్, కోల్ క‌త్తా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో గెలిచిన టీం ఫైనల్ లో చైన్నై తో ఆడ‌నుంది.

- Advertisement -