రాజశేఖర్ రెడ్డి నేను మంచి స్నేహితులంః చంద్రబాబు

129
Chandra babu Ysr

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి మిత్రుడన్నారు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. వైఎస్ కు నాకు రాజకీయ వైరం తప్ప వ్యక్తిగతంగా వైరం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో విగ్రహాల తొలగింపుపై చర్చ జరిగిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో టిడిపి నేతలు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను కూల్పివేశారన్నారు.

రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలంటే చంద్రబాబుకు కడుపు మంట అని విజయవాడలో ఎవరికీ అడ్డం లేని చోట రాజవేఖర్‌రెడ్డి విగ్రహం ఉందన్నారు. రోజూ చంద్రబాబు అదే దారి నుంచి వెళ్తుంటే.. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని చూసి ఓర్వలేక దానిని తొలిగించారన్నారు. రాజశేఖర్ రెడ్డి నేను ఇద్దరం ఒకే రూం పడుకునే వాళ్లం అన్నారు. ఇద్దరం ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చామని ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తే..నేను టీడీపీలోకి వచ్చానన్నారు. ఇక చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు ముఖ్యమంత్రి జగన్ నవ్వుతూ ఉన్నారు.