రివ్యూ: ఇస్మార్ట్ శంకర్

653
ismart shankar

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా మూవీ ఇస్మార్ట్ శంకర్‌. సరికొత్త గెటప్‌లో ఈ మూవీలో కనిపించిన రామ్‌…ట్రైలర్‌,పాటలు,టీజర్‌,ఫస్ట్‌ లుక్‌లతో అంచనాలను పెంచేశాడు. రామ్ సరసన నిధి అగర్వాల్,నభా నటేష్ హీరోయిన్లుగా నటించగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీతో రామ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?పూరి,రామ్ హిట్ కొట్టారా లేదా చూద్దాం…

కథ :

పాతబస్తీలో సెటిల్మెంట్స్‌ చేసే కుర్రాడు శంకర్‌ (రామ్‌ పోతినేని) . ఓ డీల్ విషయంలో పరిచయం అయిన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఓ వ్యక్తిని చంపిన కేసులో జైలుకు వెళ్తాడు. సీన్ కట్ చేస్తే జైలు నుంచి తప్పించుకున్న శంకర్‌ మెదడులో మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు…?ఇలా చేసింది ఎవరు..?అసలు శంకర్‌కు ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు..? హత్య కేసు నుంచి శంకర్ ఎలా బయటపడ్డాడు అనేది తెరమీద చూడాల్సిందే.

Image result for ismart shankar review

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ మాస్ ఎలిమెంట్స్‌,బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌,రామ్ నటన. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు హీరో రామ్‌. తెలంగాణ యాసలో శంకర్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో రామ్ నటన సూపర్బ్. తమ గ్లామర్‌తో సినిమాకు మరింత అందం తెచ్చారు నిధి అగర్వాల్,నభా నటేష్‌. ఇద్దరు ఎవరికి వారే తమ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశారు. మిగితా నటీనటుల్లో సత్యదేవ్‌ ,షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే, రొటీన్ కమర్షియల్ ఫార్ములా. కథ కొత్తగా ఉన్న కథనం విషయంలో తన రొటీన్ స్టైల్‌నే ఫాలో అయి నిరాశపర్చాడు.

సాంకేతిక విభాగం:

సాంకేతిక సినిమా పర్వాలేదనిపిస్తుంది. మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధానబలం. తన మ్యూజిక్‌తో ప్రతీ సీన్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Related image

తీర్పు:

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న పూరి…హీరో రామ్‌తో ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఇస్మార్ట్ శంకర్‌ సినిమా చేశాడు. రామ్ నటన,మాస్ ఎలిమెంట్స్‌ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా తన మూస ఫార్ములాతో ప్రేక్షకులను కాసింత నిరాశపర్చాడు. పూరి గత సినిమాతో పోలీస్తే కాసింత బెటరే అయినా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ ఇస్మార్ట్ శంకర్‌.

విడుదల తేదీ:18/07/2019
రేటింగ్‌:2.5 /5
నటీనటులు: రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌
సంగీతం : మణిశర్మ
నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మీ
దర్శకత్వం : పూరి జగన్నాథ్‌