రాజకీయాలకు నో చెప్పిన రజనీ‌కాంత్

57
rajini

రాజకీయాలకు నో చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ నెల 31న పార్టీ విధానాలను ప్రకటిస్తానని చెప్పిన రజనీ..అనారోగ్య కారణాలతో తన మనసు మార్చుకున్నారు. ప్ర‌స్తుతం పార్టీ పెట్ట‌ట్లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఈ మేరకు లేఖ విడుదల చేసిన రజనీ…త‌ప్ప‌కుండా రాజ‌కీయాల్లోకి వ‌స్తా.. కానీ ఇప్పుడు కాదు అని తేల్చిచెప్పారు. పార్టీ ఆలోచ‌న‌ను అనారోగ్యం కాస్త వెన‌క్కి నెట్టింద‌న్నారు. అయితే రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా ప్ర‌జాసేవ నిరంత‌రం కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న నిర్ణ‌యం అభిమానుల‌ను బాధ పెట్టొచ్చు.. త‌న‌ను క్షమించాల‌ని కోరారు.