రజనీ 2.0 అప్ డేట్స్…

257
rajani shankar
- Advertisement -

తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 2.0 . సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మరింత అటెన్షన్‌ను మరింత పెంచేశాడు.

గ్రాఫిక్ మాయాజాలంతో తెరకెక్కిన సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విడుదలైన కొద్దిగంటల్లోనే యూ ట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టింది. టీజర్‌లో శంకర్ మార్క్‌ స్పష్టంగా కనిపించేలా తీర్చదిద్దాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. గ్రాఫిక్ మాయాజాలం ప్రధానం కావడంతో ఇప్పటివరకు సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీలోగా గ్రాఫిక్ వర్క్ పూర్తవ్వాలని వీఎఫ్‌ఎక్స్ బృందానికి టార్గెట్ విధించాడట శంకర్. ఎందుకంటే నవంబర్ 29న సినిమా ఎట్టి పరిస్ధితుల్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శంకర్‌ గత చిత్రాల కన్నా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా సింహభాగం వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే ఖర్చు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 3వేల మంది నిపుణులు దీని కోసం పనిచేశారు.

- Advertisement -