అరవింద సమేత..ఆడియో రిలీజ్

265
aravinda sametha
- Advertisement -

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్స్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌,ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్‌లుక్‌ మరియు టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్నాయి. తాజాగా ఆడియోను విడుదల చేసింది చిత్రయూనిట్.

ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించి పాటల చిత్రీక‌రణ జ‌రుగుతుంది. యూ ట్యూబ్‌లో ఆడియో జ్యూక్ బాక్స్ విడుద‌ల చేశారు. కేవ‌లం నాలుగు పాట‌ల‌తో కూడిన జ్యూక్ బాక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు ప్రీ రిలీజ్ వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించి సినిమాపై ఆస‌క్తిని పెంచాల‌ని టీం భావిస్తుంద‌ట‌.

ఎన్టీఆర్ ద్విపాత్రాభియనం చేస్తున్నట్లు టాక్‌. ఫస్టాఫ్‌లో సిద్ధార్ధ్ గౌతమ్‌గా సెకండాఫ్‌లో వీర రాఘవగా కనింపిచనున్నారట. మొత్తంగా దసరాకు విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -