తాత అంటే గుర్తొచ్చేది ఏఎన్నారే:నాని

396
- Advertisement -

తాత గారు అంటే గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వర రావు అని తెలిపారు హీరో నాని. నాగార్జున-నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవదాస్. సెప్టెంబర్‌ 27న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన నాని… సీతారామయ్యగారి మనవరాలు సినిమా చూసిన తర్వాత నుంచి తాతయ్య అంటే ఏఎన్నారే గుర్తుకు వస్తారని చెప్పారు. చిన్నప్పటి నుంచి నాగార్జునను చూసినప్పుడు ఒక డౌట్ ఉండేదని, ఈ సినిమాలో ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఆయన అందం సీక్రెట్‌ను తెలుసుకునేందుకు అవకాశం దొరికిందన్నారు. నిత్యం హ్యాపీగా ఉంటూ, ఏ కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉండటమే నాగ్ అందం సిక్రెట్ అన్నారు.

nagarjuna

వైజయంతి బ్యానర్లో రెండో సినిమాలో నటిస్తున్నందకు సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నటించానని ఆ సినిమాలాగే ఈ సినిమా కూడా బ్లాక్‌బాస్టర్ అవుతుంది. రెండున్నర గంటలు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారని తెలిపారు.

సమంత మాట్లాడుతూ సోగ్గాడే చిన్ని నాయనా తరవాత అంత అసక్తిగా ఎదురుచూసిన సినిమా ఇదే. నాని చాలా మంచి నటుడు. తెరపై ఎవరిని ముందు చూడాలో అర్థం కావడం లేదన్నారు. క్రిష్‌ మాట్లాడుతూ ఈ కథ యేడాదిన్నర క్రితం విన్నా. చాలా మంచి కథ.దాన్ని అంతకంటే చక్కగా శ్రీరామ్‌ ఆదిత్య తీసుంటాడని నమ్ముతున్నా అన్నారు.

- Advertisement -