రాజమౌళితో అక్టోబర్ నుంచే

19
mahesh
- Advertisement -

మహేష్ బాబు ఏం మాట్లాడినా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడతాడు. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో అయితే మాట్లాడే ప్రతిమాటకు మహేష్ ఆచితూచి వివరణ ఇస్తూ ఉంటాడు. ఐతే, వ్యక్తిగతంగా మాత్రం మహేష్ చాలా సరదాగా మాట్లాడతాడు అని అంటుంటారు. ఈ క్రమంలోనే మహేష్ తన తదుపరి రెండు సినిమాల గురించి కూడా మాట్లాడాడట. అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం త్రివిక్రమ్ తో, తన తర్వాత సినిమాను మహేష్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

అయితే, రాజమౌళితో చేయబోయే సినిమా షూటింగ్ దసరా తర్వాత అంటే అక్టోబర్ ఎండింగ్ స్టార్ట్ అవుతుందని, అందుకు తగ్గట్టు షెడ్యూల్స్ ను పూర్తి చేయాల్సిందిగా మహేష్ త్రివిక్రమ్ ను కోరినట్టు కూడా తెలుస్తోంది. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, త్రివిక్రమ్ ఈ సినిమాను మహేష్ తో ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కోసం భారీగా కసరత్తులు చేస్తున్నాడు.

పైగా త్రివిక్రమ్ ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మహేష్ బాబు కూడా ఈ రిలీజ్ కి అంగీకరించాడు. పైగా స్వయంగా హిందీలో డబ్బింగ్ కూడా చెప్పనున్నాడు. కాగా హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి…

క్రేజీ ఆప్‌డేట్…సల్లూ భాయ్‌ టీజర్‌

పఠాన్‌పై విషప్రచారం!

వీరసింహరెడ్డి…నా అదృష్టం

- Advertisement -