రాజమౌళీకి ఊహించని షాక్ …!

150
rajamoulils-dream-dispersed
rajamoulils-dream-dispersed

రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. మహాభారతం.. చెదిరిపోయింది. గత ఏడేళ్లుగా బాహుబలి కోసం అహర్నిషలు కష్టపడ్డ రాజమౌళీకి ఊహించని షాక్ తగిలింది. ఎప్పటికైనా భారతీయ వెండితెరపై ఎవ్వరూ చూపించని విధంగా మహాభారతాన్ని ఆవిష్కరించాలని కలలు కంటున్నాడు రాజమౌళి. మరీ ఈ కల ఎప్పుడూ నెరవేరుతుందన్న ప్రశ్నకు నాకింకా అనుభవం రాలేదు.. పదేళ్ల తర్వాత చూద్దాం అంటున్నాడు జక్కన్న. ఐతే జక్కన్న ఈ మాటలు చెబుతుండగానే.. మరోవైపు వేరే మహాభారతాలకు రంగం సిద్ధమైపోతోంది. షారుఖ్ ఖాన్ ఓ విదేశీ సంస్థతో కలిసి ‘మహాభారతం’ సినిమా తీసే ఆలోచన చేస్తుండగా.. ఈలోపే యూఈఏకి చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ss-rajamouli-amitab

రాజమౌళీ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతం గురించి తరచూ మాట్లుతుండేవాడు. అమీర్ ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌లకు తన ప్రాజెక్టును వివరించాడు జక్కన్న. వారు కూడా జక్కన్నకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతలోనే నిర్మాత బీఆర్ శెట్టి రూ.1000 కోట్లతో ‘మహాభారతం’ సినిమాను తెరకెక్కించనున్నట్లు అధికారికంగా ప్రకటించేశాడు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2018లో మొదలుపెడతారని సమాచారం. 2020లో ఈ చిత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 90 రోజుల వ్యవధిలో రెండు సినిమాలూ విడుదలవుతాయి.

Mohanlal-Randamoozham-to-be-made-on-Rs-1000-crore-1492446755-1867

భీష్ముడి దృక్కోణంలో మహాభారతం ఆధారంగా ‘రండమూలం’ అనే నవల రాసిన వాసుదేవ్ మీనన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చనున్నాడు. శ్రీకుమార్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. భారతీయ ప్రముఖ నటీనటులతో పాటు కొందరు హాలీవుడ్ యాక్టర్స్ ను కూడా ఈ సినిమాలో నటింపజేస్తారట.హిందీ.. తమిళం.. మలయాళం.. తెలుగు.. ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తారట. ఈ చిత్రం పలు భారతీయ భాషల్లోనూ అనువాదమవుతుందని వెల్లడించారు. భీష్ముడిగా మళయాలం నటుడు మోహన్‌లాల్ కనిపించనున్నట్టు సమాచారం.