గందరగోళంలో భారీ సినిమా 

29
- Advertisement -
మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా పై యావత్తు తెలుగు సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ, ఈ సినిమా మొదలుపై అంతా గందరగోళంగానే ఉంది.  అందుకు తగ్గట్లుగా రోజుకొక రూమర్ వినిపిస్తోంది. అసలు మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఐతే, తాజాగా రెండు రూమర్లు వైరల్ గా మారాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మరో సూపర్ స్టార్ కూడా నటిస్తాడని టాక్. ఇక మరో రూమర్ విషయానికి వస్తే..  వచ్చే ఏడాది ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా  ఈ సినిమాను కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు 
 
కానీ, అధికారికంగా ఎలాంటి అప్ డేట్ లేదు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయబోతున్నారు. అందుకు తగ్గట్లుగా మహేష్ ప్రస్తుతం ఈ సినిమా పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా పై ఇప్పుడు చర్చ మొదలు అయ్యింది. రాజమౌళి సినిమా కోసం 2024 ఆగస్టు లేదా అక్టోబర్ లో మహేష్ డేట్స్ ఇస్తాడని, ఈ లోపు తన బాడీ పై కసరత్తులు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. 
 
ఇంతకు రాజమౌళి – మహేష్ సినిమా షూటింగ్ ఎప్పుడు ?, రిలీజ్ ఎప్పుడు ? అనే విషయాల్లో  ఫ్యాన్స్‌ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ సినిమాతో మహేష్  హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. హిందీలో మహేష్ కి తొలి సినిమా అవ్వడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ,  షూటింగ్‌ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు. అన్నట్టు ఈ సినిమా ఓ సోషియోఫాంట‌సీ క‌థతో సాగుతుందట. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి బోలెడు పుకార్లు వినిపించాయి. ఓ తెలుగు వాడు.. ఆఫ్రికాలో అడుగు పెట్ట‌బోతున్నాడు. అక్క‌డ మ‌నుషులు, వాతావ‌ర‌ణం, చెట్లూ, చేమ‌లూ అన్నీ కొత్త‌గా ఉండ‌బోతున్నాయట.
 
- Advertisement -