అజీర్తితో భాదపడే వారికి..అద్బుతమైన చిట్కా!

59
- Advertisement -

అజీర్తి అనేది ప్రతిఒక్కరు ఎదుర్కొనే సర్వసాధారణమైన సమస్య. మనం తినే ఆహారంలో కల్తీ జరిగిన.. లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు, లేదా మాంసాహారం తిన్నప్పుడు, కలుషితమైన నీరు లేదా స్ట్రీట్ ఫుడ్ తిన్నప్పుడు.. ఇలా చాలా సందర్భాల్లో అజీర్తి సంభవిస్తూ ఉంటుంది. సమయపాలన లేకుండా ఆహారం తిన్నప్పుడు కూడా అజీర్తి ఏర్పడుతుంది. అజీర్తి కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడడంతో పాటు కొన్ని సమయాల్లో వాంతులు, విరోచనలు కూడా ఏర్పడుతూ ఉంటాయి.. అందువల్ల అజీర్తిని అశ్రద్ద చేయరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయి అజీర్తి బారిన పదకుండా ఊందేందుకు వంటింటి చిట్కాలు చక్కగా ఉపయోగ పడతాయి. అవేంటో చూద్దాం.

ఆహారం తిన్న తరువాత అజీర్తిగా అనిపించినప్పుడు ఒక కప్పు నీటిలో అల్లం ముక్కను వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత మరింగించిన నీటిని వాడగట్టి ఒక గ్లాస్ లో తీసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడూ తాగాలి. ఇలా అజీర్తి సమస్య తీవ్రతను బట్టి ఒకటి లేదా రెండుసార్లు చేయడం ద్వారా కడుపులో గ్యాస్ సమస్య తగ్గి తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది. తద్వారా అజీర్తి ఏర్పడదు. ఇక అజీర్తిని తగ్గించడంలో బేకింగ్ సోడా కూడా చక్కగా ఉపయోగ పడుతుంది.

Also Read:పిక్ టాక్ : అందాలతో దుమ్ములేపిన అనసూయ

ఒక గ్లాస్ నీటిలో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని తాగితే అజీర్తి సమస్య దురమౌతుంది. అలాగే సొంపు కూడా అజీర్తిని దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. భోజనం చేసిన తరువాత చిటికెడు సొంపు నోట్లో వేసుకొని నమలడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలా కాకుండా ఆహార తినే ముందు ఒక గ్లాస్ నీటిలో చిటికెడు సొంపు వేసి బాగా మరిగించి దానికి ఒక స్పూన్ యాపిల్ వెనిగర్ కలిపి ఆ మిశ్రమని తాగితే కడుపులోని ఎటువంటి సమస్యలైన దూరమై అజీర్తి,మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఇవే కాకుండా మార్కెట్లో దొరికే ఈనో ( ENO ) వంటివి కూడా అజీర్తిని దూరం చేయడంలో చక్కగా ఉపయోగ పడతాయి.

 

- Advertisement -