నార్త్‌లో బీజేపీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

31
- Advertisement -

ఆయా రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రుల ఎంపికపై మాత్రం కాషాయ పార్టీ తర్జన భర్జన పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు మూడు రాష్ట్రాలకు సబంధించి సి‌ఎం లను ఎంపిక చేసి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముమ్మర కసరత్తులు చేస్తోంది. మధ్యప్రదేశ్ సి‌ఎం గా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ సి‌ఎం గా విష్ణు దేశ్ సాయి, రాజస్థాన్ సి‌ఎం గా భజన్ లాల్ శర్మ లను ఎంపిక చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ అధిష్టానం ఎందుకు ఆలస్యం చేసిందనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్నీ సమీకరణాల ఆధారంగా ముఖ్యమంత్రులను ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో కుల సమీకరణాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. .

అందుకే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కుల సామాజిక ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న వారికి సి‌ఎం పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే మధ్య ప్రదేశ్ లో మోహన్ యాదవ్ ను సి‌ఎం గా చేయడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొంత అసంతృప్తి గా ఉన్నట్లు వినికిడి. ఎందుకంటే 18 ఏళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. తాను వైపు నుంచి ఎలాంటి తప్పు లేనప్పటికి సి‌ఎం పదవి తనకు దూరం చేశారనే అసహనం శివరాజ్ సింగ్ చౌహాన్ లో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అలా మిగతా రాష్ట్రాలైన రాజస్థాన్ ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే అసంతృప్తి వైఖరి కొంత మంది నేతల్లో ఉందట. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న బీజేపీకి కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక తలనొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నా మాట. మరి బీజేపీ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Also Read:Review 2023: ఫ్లాపైన రీమేక్ సినిమాలు

- Advertisement -