బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు దర్శక ధీరుడు జక్కన్న. ప్రస్తుతం బాహుబలి 2 ది కన్క్లూజన్ ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉన్న రాజమౌళి ఇటీవల తమిళ ఆడియో కార్యక్రమం సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలుత శివగామి పాత్ర కోసం మొదట వేరేవారిని అనుకున్నాను. రమ్యకృష్ణగారు అందుబాటులో ఉన్నా.. వేరే నటిని సంప్రదించాను. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఈ విషయంలో ఆమెకు సభాముఖంగా క్షమాపణలు చెపుతున్నాను. ఆవిడ అద్భుత నటనతో శివగామి పాత్రకు ప్రాణం పోశారు’ అని అన్నారు.
బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఎంతటి పేరొందిందో ఇప్పటికే అర్థమైంది. ఆ పాత్రలో రమ్యకృష్ణ అభినయం అద్భుతంగా ఆకట్టుకుంది. అయితే ఆ పాత్ర కోసం ముందుగా రాజమౌళి… అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించారట. శ్రీదేవితో పాటు మరికొందరు బాలీవుడ్ నటీమణులలో ఎవరో ఒకరి చేత ఈ రోల్ వేయిద్దామనుకున్నాడు రాజమౌళి. అయితే, శ్రీదేవీ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను సినిమా నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో బాహుబలి 2 తమిళ్ ఆడియో విడుదల సందర్భంగా అదే విశయం చెప్తూ రమ్య కృష్ణకి సారీ చెప్పటం అందరినీ ఆకట్టుకుంది…
అయితే జక్కన్న… రమ్యకృష్ణకు క్షమాపణలు చెప్పడం ఇది తొలిసారి కాదు. 2015లో తిరుపతిలో జరిగిన ‘బాహుబలి’ ఆడియో విడుదల వేదికపై కూడా రాజమౌళి ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు చెన్నై వేదికపై మరోసారి క్షమాపణలు కోరారు.