మార్చ్ సినిమా సందడి

53
- Advertisement -

మార్చ్ మొదటి వారంలో థియేటర్స్ లో లోకి వచ్చిన ‘బలగం’ సూపర్ హిట్ అనిపించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని రెవెన్యూ తీసుకొస్తుంది. బలగం తర్వాత ఈ శుక్రవారం నాగ శౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. సాంగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రీచ్ అవ్వలేదు. టీజర్ , ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచడంలో విఫలయమయ్యాయి.

ఇక మార్చి చివరి వారంలో 22 న విశ్వక్ సేన్ ధమ్కీ థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సినిమాతో పాటు కృష్ణ వంశీ రంగమార్తాండ రానుంది. ధమ్కీ పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్ , ట్రైలర్ తో పాటు సాంగ్స్ బాగా క్లిక్ అయ్యాయి. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఈవెంట్ తర్వాత మరింత బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కృష్ణవంశీ కొన్నేళ్ళుగా చెక్కుతున్న రంగమార్తాండ మీద అంచనాలు లేవు. కానీ తాజాగా వేస్తున్న ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. నట సామ్రాట్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో క్లిక్ అవుతుందా ? చెప్పలేం.

మార్చ్ సినిమా సందడికి దసరా తో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాడు నాని. నేచురల్ స్టార్ సరికొత్త మాస్ అవతార్ లో కనిపించబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సాంగ్స్ , టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాతో నాని తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకునే అవకాశం కనిపిస్తుంది. మార్చ్ లో బలగం నుండి దసరా వరకూ సినిమా థియేటర్స్ లో కళకళలాడనున్నాయి.

ఇవి కూడా చదవండి…

రానా నాయుడు.. మోస్ట్ వాచ్డ్ సిరీస్

దసరా కోసం 22 ఎకరాల్లో విలేజ్ సెట్..

రావణాసుర…థర్డ్ సింగిల్

- Advertisement -