మహేష్‌తో మూవీ త్వరలో ప్రారంభం!

22
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి -సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గరి నుండి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు రాజమౌళి.

ప్రస్తుతం జపాన్‌లో ఉన్న జక్కన్న మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. తాను మహేష్‌తో సినిమా చేస్తున్నానని త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందన్నారు.ఆయన మంచి నటుడని, చాలా అందంగా ఉంటారని వెల్లడించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుందని, వేగంగా నిర్మాణం పూర్తి చేసి మహేశ్‌బాబును ఇక్కడికి తీసుకురావాలని భావిస్తున్నాని చెప్పారు.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీని జపాన్ ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులతో కలిసి చూసేందుకు జపాన్‌కు వెళ్లగా మహేష్‌తో సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Also Read:KCR:దళిత,బహెజనులు ఏకంకావాలి

- Advertisement -