వర్మను రిక్వెస్ట్ చేసిన జక్కన్న..!

173
- Advertisement -

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. మళ్లీ తన ట్వీట్లతో హంగామా చేశాడు. సోషల్‌ మీడియాని వాడుకోవడంలో వర్మ స్టైలే వేరు. తనకి ఏం అనిపిస్తే అది ట్విట్టర్‌ ద్వారా చెప్పేస్తుంటాడు. అలా చెప్పిన వాటిల్లో కాంట్రవర్సిలకు దారితీసినవి కోకొల్లలు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సరదాగా పెట్టిన ఓ ట్వీట్ పెద్ద డిస్కషన్‌ కే దారితీసింది. ఆ డిస్కషన్‌తో తట్టుకోలేక  ‘అయ్యా… నన్ను ఒగ్గేయండయ్యా’ అంటూ దర్శకుడు రాజమౌళి మొర పెట్టుకున్నాడు.
 Rajamouli Reaction on Ram Gopal Varma Tweets
ఇంతకీ అసలేం జరిగిందంటే.. రాజమౌళి, తాను కలసి ఉన్న ఓ ఫొటోను వర్మ తన ట్విట్టర్లో అప్ లోడ్ చేశాడు. అంతేకాదు దానికి ‘బ్యూటీ అండ్ అగ్లీ’ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. అంతటితో ఆగకుండా.. తాను అగ్లీగా ఉన్నానని, రాజమౌళి మాత్రం అందంగా ఉన్నాడని మరో ట్వీట్ పెట్టాడు. బాహుబలి కంటే  కూడా జక్కన్న చాలా సెక్సీగా ఉన్నాడంటూ కితాబిచ్చాడు వర్మ.
 Rajamouli Reaction on Ram Gopal Varma Tweets
ఈ క్రమంలో.. ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ మధ్యలో ఎంటరయ్యాడు. మీరిద్దరూ గొప్ప దర్శకులు అనడంలో ఎలాంటి సందేహం లేదని… అయితే, మీ ఇద్దరూ అగ్లీగానే ఉన్నారంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా.. బాబూ మీ అంత, షారుఖ్ ఖాన్ అంత అందంగా అందరూ ఉండలేరంటూ వర్మ రిప్లై ఇచ్చాడు. అయితే దీనిపై స్పందిస్తూ.. తాను అందంగా ఉంటానన్న విషయం తనకు తెలుసని, షారుఖ్ గురించి మాత్రం చెప్పలేనని కమాల్ అన్నాడు. ఇక ఇదే క్రమంలో రాజమౌళి కూడా స్పందిస్తూ, ‘అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా’ అంటూ వేడుకున్నాడు.  ఎప్పుడూ కాంట్రవర్శిలు క్రియేట్‌ చేసే వర్మ ఇప్పుడు ఈ సరదా ట్వీట్లు చెయ్యడంతో నెటిజన్లను భలేగా నవ్వుకుంటున్నారు. ఏదేమైనా ఈ సరదా ట్వీట్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

 Rajamouli Reaction on Ram Gopal Varma Tweets

- Advertisement -