సాహో… ఫస్ట్‌ లుక్‌ !

175
Prabhas saaho first look
Prabhas saaho first look
- Advertisement -

బాహుబలి సినిమా కోసం దాదాపు నాలుగేళ్లకు పైగా సమయం కేటాయించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. తన తర్వాతి చిత్రాన్ని ఖాయం చేసుకన్న సంగతి తెలిసిందే. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న గ్రాండ్ మూవీ ‘సాహో’. ఈ సినిమాకు ఫస్ట్ లుక్ కూడా అప్పుడే ఇచ్చేశారు.

ఇంకా సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు కానీ.. అప్పుడే ఫస్ట్ లుక్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ సాహో టీజర్ ను కూడా బాహుబలి2తో కలిపి ప్రదర్శించబోతున్నారు. అయితే.. ఫస్ట్ లుక్ లోగో డిజైన్ చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. తెలుగు సినిమానే అయినా.. కేవలం ఇంగ్లీష్ లోగో డిజైన్ వరకే ఇచ్చారు. తమిళ్.. హిందీల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది కాబట్టి.. ఒకటే పోస్టర్ ను అన్ని చోట్లా సరిపోయేలా డిజైన్ చేసినట్లు భావించచ్చు. సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ ఫేస్ ను డిజైన్ చేసిన తీరు మాత్రం డిఫరెంట్ గా ఉండడమే కాదు.. ఆకట్టుకుంటుంది కూడా.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు బాగం కానున్నారు. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో యాక్షన్ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరిస్తున్నామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించేశారు.

- Advertisement -